అధికార పార్టీలో చేరలేదని, ప్రతిపక్ష పార్టీకి చెందిన జగనన్న గృహాల లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల బిల్లులు నిలిపేశారు. ఈ పరిస్థితి పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలంలో చోటు చేసుకుంది. జనసేన పార్టీ పీలేరు నియోజకవర్గం ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆ గ్రామాన్ని సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాల్మీకి పురం పంచాయతీ, పత్తేపురం గ్రామానికి చెందిన జనసీన పార్టీ కార్యకర్తలు బాలు, శివ, రమేష్ లకు జగనన్న కాలనీల్లో ఇళ్లు మంజూరయ్యాయన్నారు.
వీరు జనసేన పార్టీ మద్దతుదారులంటూ, వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు వారి బిల్లులు పెట్టద్దంటూ అధికారులపై ఒత్తిడి తీసుకు రావడం సిగ్గుచేటన్నారు. తాము కులమతాలకు, రాజకీయాలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తున్నామని సభల్లో చెప్పడం కాదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బాధిత లబ్ధిదారులకు ధైర్యం చెప్పి, పేదలకు అందాల్సిన పథకాలు అందేలా, సంబంధిత అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాటసారి, మండల ఇంచార్జ్ కిషోర్, ఉపాధ్యక్షులు సందీప్, కుమార్, ప్రదీప్ సింగ్, భాస్కర్, బాలాజీ, ధనుష్, సుకుమార్, రాజ్ కుమార్, రెడ్డి శేఖర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.