ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీ: జవహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 02:20 PM

వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ద్వారా విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి కే. ఎస్ జవహర్ విమర్శించారు. రాజమండ్రిలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కొవ్వూరు-రాజమండ్రి మధ్యలో ఉన్న 300 ఎకరాల లంక భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 


గోంగూరగడ్డలంకలో రూ. 2 కోట్లు విలువ చేసే వృక్ష సంపదను వైసిపి నాయకులు నరికి రవాణా చేశారని ఆరోపించారు. ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కాలపరిమితి ముగిసి రెండేళైనా ఎన్నికలు పెట్టకుండా రాష్ట్ర హోంమంత్రి సహకారంతో దళిత భూముల్ని కాజేస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com