ఎస్సి హెబిటేషన్ల లోని ప్రతి కుటుంబానికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జెసి. వెంకటేశ్వర్, డి ఆర్ ఓ యన్. రాజశేఖర్ లతో కలసి జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులతో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 500 ల ఎస్ సి హెబిటేషన్ల లో ఉన్న ప్రతి కుటుంబానికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇకా లేని కుటుంబాలను వారి గుర్తించడానికి సర్వే నిర్వహించాడానికి ప్రణాలిక తో ముందుకు వెళ్ళని పౌర సరఫరా శాఖ అధికారుల ను ఆదేశించారు.
ఇకా గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలను గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకా గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాల వివరాలను హెబిటేషన్ల వారిగా సర్వే చేయించాలన్నారు. జిల్లా లోని ప్రతి ఎస్ సి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్లు వుండే విదంగా చర్యలు తీసుకోవాలని సంబందితా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ, శంకరన్, డి యం. మోహన్ బాబు పాల్గొన్నారు.