తూర్పు గోదావరి: అల్లవరం మండలం బెండమూర్లంక పెట్రోల్ బంక్ యజమానిపై ఒక యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకుని విషయంలో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో ముగ్గురు ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ముగ్గురు మైనర్స్ పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. వివాదంలో యువకుడు బంకు యజమాని పై దాడికి యత్నించగా యజమాని గుర్రం బాబ్జి తృటిలో తప్పించుకున్నారు. దాడికి పాల్పడ్డ యువకుడిది అల్లవరం మండలం తమ్మలపల్లి గా తెలియవచ్చింది.