రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో స్థానిక పంచాయితీ వీధిలో గల రా మాలయంలో శ్రీ రామభద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన యర్రంశెట్టి రామారావు సుభాషిణి దంపతులు పీట్లపై కూర్చొని శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమాన్ వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద మంత్రాలతో హోమాన్ని నిర్వహించారు. అనంతరం రామ మందరం వద్ద భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు రాజకీయ నాయకులు, యువకులు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.