15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 31 అని, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి జూన్ 3 చివరి తేదీ అని ఎన్నికల సంఘం గురువారం తెలిపింది. జూన్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.అలాగే కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని నాలుగు స్థానాలకు జూన్ 13న ఎన్నికలు జరుగుతాయని.. ఫలితాలు జూన్ 15న వెల్లడిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa