త్వరలో కాంబాబు బర్తరఫ్ ఖాయమని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు పేరును ట్యాగ్ చేస్తూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నిన్న ఓ హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే అంటూ వార్నింగ్ ఇచ్చిన అయ్యన్న పాత్రుడు ఈ రోజు ఇదే విషయంపై వివరాలు తెలిపారు.
''సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్... ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు... త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి.
మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం'' అని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa