ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించింది. అలాంటి సమయంలో కూడా ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించుకుంది. అలాంటిది తాజాగా ఆ దేశంలో కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉత్తర కొరియాలో మొదటి కేసు నమోదుకాగా నేడు కరోనాతో తొలి మరణం కేసు నమోదైంది.
ఉత్తరకొరియా రాజధాని అయిన ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించినట్లు ఆ ప్రభుత్వం తెలిపింది. మరణించిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది. మృతుడిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2ను గుర్తించినట్లు వైద్య నిపుణులు తెలిపారు.