మహారాష్ట్ర మాలేగావ్ లోని మోర్జార్ శివరా ప్రాంతంలో ఓ చిన్నారి పిల్లి అనుకుని చిరుత పిల్లను ఇంటికి తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు కూడా మొదట దానిని పిల్లికూన అనే అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి అది చిరుత పిల్ల అని తెలియడంతో భయపడిపోయారు. అయితే ఆ చిరుత పిల్ల చిన్నది కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చిన్నారి చిముకల్య ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చేటప్పుడు దారిలో కనిపించిన చిరుత పిల్లను పిల్లి అనుకుని వెంట తెచ్చుకుంది. ఏ క్షణంలోనైనా ఆ చిరుత కూన కోసం తల్లి రావొచ్చని భావించిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆ చిరుత పిల్లను వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు. తల్లి చిరుత జాడ లేకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa