గుంటూరు జిల్లా , జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పొన్నూరు టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు . ఇలా జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్, సీఈఓ లను తొలగించాలని, వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రాదు చేసి, అక్రమాల్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్న వైసీపీ ముఖ్యనేత బంధువు కారుమూరి అశోక్ రెడ్డి, మాచవరం తహశీల్ధార్ హనుమంతరావు పై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారితో సమావేశమై బ్యాంకులో జరిగిన అక్రమాలపై నివేదిక తెలియచేసారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకి ఆదేశించి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.