దాహం వేస్తే చాల మంది చెరకు రసం తాగుతుంటాయి. అయితే షుగర్ ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటి?. ఈ పానియాన్ని తాగాలన్న ఆశ వారికి ఉన్నప్పటికీ శరీరంలో చెక్కర శాతం పెరిగిపోతుందేమో అని వాటికి దూరంగా ఉంటారు. షుగర్ ఉన్న వారు నిజంగానే చెరకు రసం తాగవద్దా?. అలాంటి భ్రమలేమి అక్కర్లేదు అంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో పైబర్ మాత్రమే కాకుండా, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ ఉంటాయి. అంతే కాకుండా సాధారణ చెక్కరతో పోల్చితే ఇందులో ఉంటే చక్కర స్థాయి చాలా తక్కువ. చెరకులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషంట్లు ఈ చెరకు రసం తాగవచ్చు. అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా ఓ గంట ఆగిన తర్వాత తీసుకోవడం మంచిది అంటున్నారు.