శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా , పూల దండలు , బుకేలు, స్వీట్ పాకెట్స్ తీసుకురాకండి వాటికీ బదులుగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ , స్కూల్ బాగ్స్ లాంటివి తీసుకువచ్చి పేద పిల్ల చదువులకి ఆసరాగా నిలవండి అని ఇప్పటికే ఆయన వినూత రీతిలో బ్యానర్లు కట్టించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ రోజే ఆయన పుట్టిన రోజు కావడంతో వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియచేసారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే మీరు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరింతగా ప్రజాసేవకు పాటుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అని ఆశీర్వదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa