రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఎంతో కృషి చేశారని జడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. సోమవారం పోలాకి మండలం మబుగాం గ్రామములో జగనన్న కాలనీ ఇళ్లను నిర్మించుకుంటే చిన్నాల ప్రభాకర్ రావు ఇంటిని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతింటి కలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి ఎంతో చొరవ చూపుతున్నారని ఈ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట జడ్పిటిసి ప్రతినిధి చింతు రామారావు, కూరాకుల రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్ష ప్రతినిధి రాజపు అప్పన్న, కోరాడ చంద్రభూషణ్ గుప్తా, స్థానిక సర్పంచ్ పిట్ట దానమ్మ తదితరులు పాల్గొన్నారు.