వల్లూరు మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లె గ్రామంలో నరసింహారెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా 5వ రోజు శనివారం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హంపీ క్షేత్ర స్వర్ణ హంపీ స్వామిజీ శ్రీ గోవిందానంద సరస్వతి, శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవానందం రామానుజ జీయర్ పీఠాధిపతుల ఆధ్వర్యంలో వైభవంగా వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య మంగళవాయిద్యాల మధ్య భక్తుల ఆనందోత్సాహల మధ్య కల్యాణం నిర్వహించారు.
ఉదయానే కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఆదివారం లక్ష్మీ నరసింహ గాయత్రి సర్వ రక్షాకర, ప్రాయచిత్త హోమాలను నిర్వహించారు. అనంతరం దర్శన లక్ష్మీనరసింహ యజ్ఞం మహా పూర్ణాహుతి వేద పండితులు రాజేష్ నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను బాగా అలంకరించి కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ముందుకు విశ్వక్సేన ఆరాధన నిర్వహించి గణపతిని పూజించడం జరిగింది. భక్తులు కల్యాణాన్ని తిలకించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కల్యాణ వేడుకలో రామచంద్రారెడ్డి దంపతులు, చైతన్యరెడ్డి దంపతులు, లక్ష్మణ్ రెడ్డి దంపతులు, సాయినరసింహారెడ్డి, వుత్తా ఇంటి అల్లుళ్లు, అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన పుత్తా అనుచరులు స్వామివారిని దర్శించుకున్నారు. నరసింహస్వామి కుంభా భిషేక మహోత్సవంలో భాగంగా చెక్కభజన పోటీలను నిర్వహించారు. సీనియర్ విభాగం ఎద్దుల పోటీలను నిర్వహించారు. సాయంత్రం వేళ బహుమతులను అందజేశారు. రాత్రి 9 గంటలకు ఆర్కేస్ట్రా కార్యక్రమం నిర్వహించారు.