తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి సచివాలయంను ఎంపీపీ హెచ్ రేఖ హరిచంద్ర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని వారిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.