నల్లద్రాక్షలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు అంటున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నల్ల ద్రాక్షలో విటమిన్ ఏ, సీ, బి6, ఫోలిక్ ఆమ్లం, గ్లూకోజ్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలున్నాయి. అందువల్ల నల్లద్రాక్షలు తింటే రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.
- నల్ల ద్రాక్షలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముఖంలోని వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. యవ్వనంగా ఉండేందుకు తోడ్పడతాయి.
- నల్ల ద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. నల్ల ద్రాక్షలలో రెస్వరెటాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. తద్వారా శరీరంలోని చక్కెర స్థాయులను సమతుల్యం చేస్తుంది.
- నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొవ్వును తగ్గించి, గుండె సమస్యలు రాకుండా కాపాడతాయి.