గంగమ్మ జాతర మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మంగళవారం(రేపు) నాడు అతిముఖ్యమైన గంగజాతర సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకునేలా పోలీస్ శాఖ వారితో క్యూ లైన్లను పరిశీలించారు. ఆలయం లోపల, వెలుపల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ వారికి సూచనలిచ్చారు. ఇందులో ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ , సి ప్రకాష్ , పోలీస్ సిబ్బంది వున్నారు.