తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు పంచాయతీ ఉపాధిహామీ పథకం కూలీలు రోడ్డుపై బైఠాయించారు. ఉపాధి హామీ పథకంలో ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం వరకు పనులు చేయాల్సిందే అని చెప్పడంతో కూలీలు సత్యవేడు ఊత్తుకొట్ట రోడ్డుపై బైఠాయించినట్లు సమాచారం. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.