చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మను దర్శించుకునే సందర్భంలో విద్యుదాఘాతానికి గురై ఆలయంలో ఒక మహిళ మృతి చెందడం దురదృష్టకరం, బాధాకరమని మాజీ మంత్రివర్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ముత్తాచారిపాళ్యంలో మృతురాలు రజని (58) కుటుంబీకులను ఆయన సోమవారం కలిసి పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును మృతురాలి భర్త ప్రభాకర్ ఆయనకు తెలియజేసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.