ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే నెల జూన్ 6 నాటికి 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగో విడత వైఎస్సార్ రైతు భరోసా- ఏపీ కిసాన్ కార్యక్రమాన్ని ఏపీ రైతుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతు రథం పేరుతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ జూన్ 6న ప్రారంభిస్తారని తెలిపారు. రైతులు తమకు నచ్చిన కంపెనీకి చెందిన ట్రాక్టర్ను నేరుగా కొనుగోలు చేసి, వాటికయ్యే నగదు సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు.