ఏపీలో 3 రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని అన్నారు. 3 రాజధానుల్లో భాగంగా కర్నూలుకు జ్యుడిషయల్ క్యాపిటల్ వచ్చేసిందని మంత్రి అన్నారు. కానీ తాను ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నానని, అఫీషియల్ గా అప్పుడే చెప్పకూడదని అన్నారు. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయని, ఏం జరగబోతుందో మీరే చూస్తారని మంత్రి అన్నారు.
కర్నూలుకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని మంత్రి సురేష్ వెల్లడించారు. ఏపీలో టౌన్ ప్లానింగ్ లో అవినీతి ఉందని అన్నారు. విజిలెన్స్, ఏసీబీ కేసుల ఫైల్స్ చూస్తే 150 కేసుల వరకు ఇవే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ తీరు మారాల్సిన అవసరం ఉందని, సిటీ ప్లానర్ ఈ విషయంలో బాధ్యత వహించాలన్నారు. కిందిస్థాయి సిబ్బందిపై నెపం వేస్తే కుదరదని మంత్రి హితవు పలికారు. ఏపీలో సుమారు 16వేల అక్రమ లేఅవుట్లు ఉన్నాయని మంత్రి అన్నారు.