వేసవి సెలవులు పురస్కరించుకొని ఆళ్లగడ్డ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల సందర్భంగా మే 17 నుంచి 30వ తేదీ వరకు స్థానిక గ్రంథాలయంలో విజ్ఞాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా వివిధరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.