ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆలయ పాలకమండలి అధ్య ర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా 9వరోజు సోమవారం ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం పుష్ప మండపం, మధ్యాహ్నం వసంతోత్సవము (చక్రస్నానం) సాయంత్రం. హంస వాహనంలో చెన్నకేశవుడు ప్రత్యేకమైన అలంకరణతో పట్టణ పురవీధుల్లో ఊరేగింపు లో దర్శన మిచ్చారు.
ఈ సందర్భంగా అల య అర్చకులు కోనేరు ఆచార్యులు, మకరంద బాబు, బాను ప్రకాష్, చక్రధర్లు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ప్రత్యేక పూజలను నిర్వహిం చారు. పుష్ప మండపం వాహన ఉభయ దాతలుగా డివి వెంకటేశులు (చిట్టి) అండ్ సన్స్, డిపి వెంకటేశులు వసంతోత్సవం ఉభయ దాతలుగా వంక దారి కేశవ రామానుజ ప్రసాద్, నాగమణి అండ్ సన్స్, టీ హరిప్రసాద్, కృష్ణమూర్తి, టి. రామ్ మోహన్, రంగ మన్నార్, రవి కృష్ణ వినోద్ కుమార్ హంసవాహన ఉభయ దాతలుగా తిరుచానూరు హరిప్రసాద్, కృష్ణమూర్తి రామ మోహన్, రవి కృష్ణలు వ్యవహరించారు. ఈ కార్యక్రమం కరోనా నియంత్రణ పద్ధతు ల నడుమ నిర్వహించారు. దేవాలయము అంతా విద్యుత్ దీపాల అలంకరణతో, వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ఈవో వెంకటే శులు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, దేవాలయ సిబ్బంది రామశాస్త్రి మల్లికార్జున, హరి తదితరులు పాల్గొన్నారు.