నారాపురస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు స్వామి వారు కల్పవృక్ష వాహనంపై దర్శసమిచ్చారు. సోమవారం వేదపండితులు స్వామివారిని కల్పవృక్ష వాహనంపై కొలువు దీర్చారు. అనంతరం పల్లకీలో పురవీధుల మీదుగా భక్తులు మోస్తు తమ భక్తిని చాటుకున్నారు. ఇంటి ముందుకు వచ్చిన స్వామి వారికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రాత్రి పదిన్నర గంటలకు స్నపన తిరమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం ఉదయం మోహిని ఉత్సవం, సాయంత్రం గరుడ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వేదపండితులు తెలిపారు.