ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ గ్రామంలో పౌర్ణమి కళ్యాణము సోమవారం ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం మండల మండపము నందు సీత రాముల కళ్యాణం ఘటాన్ని నిర్వహించారు. టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు వచ్చి కళ్యాణం వీక్షించారు.