పులివెందుల నియోజకవర్గం వేముల మండలం చాగలేరులో ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి కోసం శనివారం నుంచి చేపట్టిన గాలింపు చర్యల్లో సోమవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సీ కాలనీకి చెందిన అంకాలయ్య అనే వ్యక్తి శనివారం సాయంత్రం ఈతకు వెళ్లి గల్లంతైన విషయం విధితమే. వ్యక్తి ఆచూకీ కోసం శనివారం, ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. మండల వైకాపా కన్వీనర్ సాంబశివారెడ్డి పర్యవేక్షణలో జమ్మలమడుగు నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అంకాలయ్య మృతదేహం లభ్యమైంది. అంకాలయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.