మామిడి చెట్ల పై గోలి సైజు పిందెలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఈ సమయములో పిందె నిలబడి కాయ అభివృద్ధి చెందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలని ఊటుకూరు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
తేనె మంచు పురుగు నివారణకు తయోమెథక్సామ్ 0. 30 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0. 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సాగునీటి వసతి లేని తోటల్లో కాపు ఉన్న చెట్లపై లీటరు నీటికి 19: 19: 19 రకం 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే కాయలు వృద్ధి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.