బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు సీనియర్ అధికారులు వారి విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కారంచేడు, ఇంకొల్లు, పర్చూరు, మార్టూరు పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ అధికారులు మహిళా పోలీసులను సమావేశపరిచి స్త్రీలకు భద్రత కల్పించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందున బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని వారు మహిళా పోలీసులను ఆదేశించారు. అలాగే దిశ ఆప్ ను ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకునే విధంగా వారిని ప్రభావితం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దిశా ఆప్ కు సంబంధించి జిల్లా ఎస్పీ జిందాల్ ప్రవేశ పెట్టిన లక్కీ డ్రా కాంటెస్ట్ గురించి కూడా విస్తృత ప్రచారం చేయాలన్నారు.