ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలోని పొదిలిమ్మ నగర్ లో నివాసం ఉంటున్న హుసేబి తన భర్త చనిపొవడంతో నల్గొండజిల్లా నకరికల్ ప్రాంతానికి చెందిన ఖాదర్ తో సహజీవనం చేస్తుంది. ఖాదర్ కలాయి పనిచేసుకుంటు వృత్తి రిత్యా పలుగ్రామాలు తిరుగుతు పాడై పొయినా బిందెలకు మాట్లు వేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. హుసేన్ బి పరిచయంతో పొదిలి చుట్టుప్రక్కల పనిచేస్తున్నాడు.
హుసేబికి మొదటి భర్తకు కలిగిన ఒక కుమారుడు మీరావళి ఉన్నాడు. ఇతను పట్టణంలోని కూలి పనులు చేసుకుంటు తల్లితొ కలిసి ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఖాదర్ మద్యం తాగి తల్లిని వేదిస్తుండటంతో భరించలేని మీరావళి వరుసకు పినతండ్రి అయినా ఖాదర్ ను సిమెంట్ బ్రిక్ తో మెది చంపి శవాన్ని ఒక గొనసంచెలో కట్టి పొలీస్ స్టేషన్ కు వెళ్ళి లోంగిపొయ్యాడు. ఈ విషయం తెలుసు పొదిలి సిఐ సుధాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.