గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, విజయవాడ లో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో , 7వ డివిజన్ 40 సచివాలయ పరిధిలోని సున్నంబట్టీల సెంటర్,అమ్మా కల్యాణ మండపం ఎదురు రోడ్డు నుండి మొదలై సిద్దార్ధ్ నగర్,జర్నలిస్ట్ కాలనీ,దాసరి రమణ కాలనీ, ఇందిరా నగర్ నందు జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి వారికి లబ్ది జరిగేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బంది,మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది.