పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనా కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు డిఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సోమవారం అనగా నిన్న జరిగిన స్పందనా కార్యక్రమానికి ప్రజల నుండి 63 ఫిర్యాదులు రావడం జరిగినదని, సదరు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించవలసినదిగా ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగినదని ఎస్పీ తెలిపారు. అందులో కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించగా, ఫిర్యాదు దారులు ఎక్కువ వడ్డీకి ఆశపడి నగదు అప్పు ఇచ్చి మోసపోయినట్లు తెలుస్తుంది కావున ప్రజలు ఎక్కువ వడ్డీకి ఆశపడి, నగదు అప్పుఇచ్చి మోసపోవద్దు అని హితవు పలికారు.