రాష్ట్రంలో కౌలు రైతులకి అండగా నేనున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేపట్టి , మరణించిన కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున , ఆర్ధిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలానే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ని దత్త పుత్రుడు అని సంభోదిస్తూ... ప్రభుత్వాన్ని ప్రజలలో తప్పు దారి పట్టిస్తున్నారు అని పలికిన మాటలు తెలిసినవే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం.ఇంకా లేని పొత్తులు గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది, మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి అని హితవు పలికారు.