రాష్ట్రంలో అంబానీ, ఆదానీలు వ్యాపారపరంగా అడుగుపెడుతున్నారు అని ఒక వార్త సంచనంగా తిరుగడుతుంది. ఐతే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదీ అనేది అధికారికంగా తెలియని విషయం. ఐతే ఈ విషయం మీద స్పందించిన టీడీపీ సీనియర్ నాయకులూ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.... ఆదాని గ్రూప్ ఇంకో వంద కంపెని లు కొన్న ఆయనకి, అందులో పనిచేసేవారికి మంచిదే కానీ ఆయన బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులు తీర్చి తరువాత కంపెనీలు కొంటే మంచిది..ఎందుకంటే మళ్ళీ దివాళా తీసి ఆ అప్పు అంత ప్రజల పై మోపడం..సమంజసం కాదు కదా..అంతే కాకుండా వ్యాపారం అయిన అధికారం అయిన ఒకరి చేతుల్లో వ్యవస్థ లు ఉండడం కూడా కరెక్టు కాదు అని తెలియచేసారు.