ప్రభుత్వ మద్యం దుకాణంలో, మద్యం అప్పు ఇవ్వనందుకు వైన్ షాప్ సేల్స్ మెన్ పై మందుబాబులు దాడి చేసి గాయపరిచిన ఘటన కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గోపువానిపాలెం ప్రభుత్వ మద్యం దుకాణంలో మందుబాబులు వచ్చి మద్యం అప్పుగా అడగగా, అప్పు ఇవ్వనన్నందుకు వైన్ షాప్ సేల్స్ మెన్ గొరిపర్తి శ్రీనివాసరావు పై విచక్షణారహితంగా దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు.
దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన షాప్ సేల్స్ మెన్ శ్రీనివాసరావును వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన పమిడిముక్కల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.