వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- రోజూ ఉదయం రెండు గ్లాసుల నీళ్లతో దినచర్య ప్రారంభించాలి. ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు.
- నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఆమ్ పన్నా లాంటి డ్రింక్ లు తీసుకోవాలి. నీళ్లలో పుదీనా ఆకులు వేసి, ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- వేసవిలో పండ్లు బాగా తినాలి. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. వాటర్ మెలన్, ఖర్బూజ, మామిడిపండు, గ్రేప్స్‌లాంటివి తీసుకోవచ్చు. హెవీ మీల్స్ కాకుండా, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ అధికంగా లభించే ఆహారాన్ని తక్కువ మోతాదులో తినాలి.
- అవుట్‌డోర్‌లో వ్యాయామం చేస్తే చెమట రూపంలో నీటిని కోల్పోతుంటారు. అందుకోసం గ్లూకోజ్ వాటర్ తీసుకోవాలి
- పుచ్చ, నిమ్మ ఈ రెండూ శరీరానికి కావాల్సిన నీటిని అందించి తేమగా ఉంచుతాయి. నిమ్మలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తాయి. పుచ్చలోని అమైనో ఆమ్లాలు బరువును కంట్రోల్ చేస్తాయి. ఈ రెండింటిని కలిపి తాగితే మంచిది. రుచి కోసం చక్కెర/ తేనెలను కూడా కలుపుకోవచ్చు.
- కొబ్బరి నీళ్లు బరువును నియంత్రిస్తాయి. వీటిని తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవ్వదు. కెలొరీలు, కొవ్వులు తగ్గుతాయి.
- గులాబీ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు నియంత్రణలో, జీర్ణ క్రియలో బాగా పని చేస్తాయి. కొబ్బరి నీళ్లు, చక్కెర, చల్లటి పాలు కలిపి చిక్కటి, చల్లటి మిల్క్‌షేక్ చేసి తాగండి.
-గ్రీన్ టీ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తాగితే శరీరానికి చల్లదనం అందుతుంది. అతినీలలోహిత కిరణాల నుంచి కూడా రక్షిస్తుంది.