చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఫిర్యాదులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. వేధింపులు 2, ఆస్తి తగాదాలు 16, గొడవలు 2, కుటుంబ సమస్యలు 5, అదృశ్యం, పోలీసు సేవలు ఒకొక్కటి చొప్పున వచ్చాయి. అన్ని ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఎస్పీ ఆదేశించారు.