ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్దులుగా ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను సీఎం జగన్ ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్దులతో సీఎం జగన్ సమావేశమై వారికి పలు సూచనలు చేయడంతో పాటు అభినందనలు తెలిపారు. సీఎంతో భేటి తర్వాత అభ్యర్దులను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి వైసీపీ నుంచి నలుగురు అభ్యర్దులను ఎంపిక చేశారు. టీడీపీకి పట్టు లేకపోవడంతో ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన నేత. కానీ ఆయన జాతీయ స్థాయి బీసీ నేత. దీనిని పరిగణలోకి తీసుకొని బీసీలకు న్యాయం చేస్తామన్న ఉద్దేశ్యంతో ఆయనను సీఎం జగన్ ఎంపిక చేశారని సమాచారం.