ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్​ రిఫరీ పై చేయిచేసుకున్న భారత రెజ్లర్​

national |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 09:31 PM

భారత రెజ్లర్​ సతేందర్​ మాలిక్ ​పై జీవిత కాల నిషేధం విధించారు. ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జరిగే కామన్వెల్త్​ క్రీడల కోసం భారత్​లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో 125 కేజీల విభాగంలో సర్వీసెస్​ జట్టుకు చెందిన రెజ్లర్​ సతేందర్​ మాలిక్​ ఓడిపోయాడు. మ్యాచ్​ ఫలితం తనకు వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయిన అతడు సీనియర్​ రిఫరీ జగ్బీర్​ సింగ్​ పై చేయి చేసుకున్నాడు. దీంతో రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా అతడిపై చర్యలు తీసుకుని నిషేధం విధించింది. కామన్వెల్త్​ క్రీడలు జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com