-- కనుబొమ్మలు, కనురెప్పలు వేగంగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఈ చిన్న చిట్కాను ఒకసారి ట్రై చెయ్యండి. ఒక స్పూను ఆముదానికి రెండు స్పూన్ల అలోవెరా జెల్ ను కలిపి కనురెప్పలకు, కనుబొమ్మలకు రాస్తే అక్కడి వెంట్రుకలు చాలా వేగంగా పెరుగుతాయి.
-- రఫ్ హెయిర్ తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కా మీకోసమే. ఒక కప్పు పెరుగుకు, 2 స్పూన్ల అలోవెరా జెల్ ను కలిపి రఫ్ హెయిర్ కు అప్లై చెయ్యాలి. బాగా ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో తలస్నానం చెయ్యాలి. ఇలా తరచూ చెయ్యటం వల్ల జుట్టు సిల్కీ గా, స్మూత్ గా మారుతుంది.
-- రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ కు 4 స్పూన్ల అలోవెరా జెల్ ను కలిపి బాగా మిక్స్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు తరచూ రాస్తుంటే, కొద్దిరోజుల్లోనే మృదువుగా, లేత గులాబిరంగులోకి మారతాయి.