మేనిఛాయను మరింత తెల్లగా చేసుకునేందుకు దాదాపు అందరూ పార్లర్‌కి వెళ్లి బ్లీచ్ చేయించుకుంటారు.బ్లీచింగ్ వలన తక్కువ సమయంలోనే చర్మం వైట్‌గా, బ్రైట్‌గా మెరిసి పోతుంది. అయితే దీనికి వేలకు వేలు డబ్బు కావాలి. అలా కాకుండా, ఇంట్లోనే సహజసిద్ధంగా వేసుకునే ఫేస్ బ్లీచ్ పద్దతిని తెలుసుకుందామా...
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూను బంగాళ దుంప రసం, ఒక స్పూను టమాటో రసం, ఒక స్పూను శనగ పిండి, ఒక స్పూను కాఫీ పొడి వేసి బాగా మిక్స్ చెయ్యాలి. అందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఒక పావుగంట ఐన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ న్యాచురల్ బ్లీచ్ వల్ల చర్మం తెల్లగా మారుతుంది.