మంగళవారం, న్యూఢిల్లీలోని జిటి కర్నాల్ రోడ్లోని అట్లాంటిస్ బాంక్వెట్ హాల్లో అగ్నిప్రమాదం సంభవించిన తరువాత,ఒక సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించారు, అతను ముందుగా బాంకెట్ హాల్ లోపల అపస్మారక స్థితిలో ఉన్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.అతడిని హరీష్ చోప్రా (30)గా గుర్తించినట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపారు. అట్లాంటిస్ బాంక్వెట్ హాల్లో అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 5.47 గంటలకు కాల్ అందిందని, 10 ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.మంటలు చెలరేగినప్పుడు బాంక్వెట్ హాల్లో ఎటువంటి కార్యక్రమం జరగలేదని అధికారులు తెలిపారు.అగ్నిమాపక చర్య పూర్తి కాగా, మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.