పంచదార కన్నా బెల్లం తో తయారు చేసిన పదార్థాలను కానీ, స్వీట్స్ కానీ తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా అందుతుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. బెల్లాన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. పరిమితిని మించి తీసుకున్నప్పుడే బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఇక మధుమేహం రోగులు చక్కెరకు ప్రత్యామ్నయంగా బెల్లం తినొచ్చు అని చెబుతుంటారు.కానీ, అతిగా బెల్లాన్ని తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు బాగా పెరిగిపోతాయంట. అంతేకాక మధుమేహం లేని వారు కూడా అతిగా బెల్లం తినటం వల్ల ,డయబెటీస్ వచ్చే రిస్క్ ఉంది. బెల్లం అతిగా తింటే మలబద్ధక సమస్య కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి అనేది ఏ విషయంలోనైనా పనికి రాదు అని పెద్దలు ఊరికే చెప్పలేదని ఇది చదివిన తర్వాత తెలుస్తుంది కదా!