కరోనా నియంత్రణను విస్మరించి ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ అణుఆయుధాల ప్రయోగాలపై ని దృష్టి పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఇన్ఫెక్షన్ గురించి అవగాహన లేకపోవడం, సరైన చికిత్స విధానం గురించి తెలియకపోవడం, డ్రగ్స్ తీసుకోవడంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్టు నివేదికలు చెబతున్నాయి. ఇదిలా ఉంటే బీజింగ్, సియోల్ వ్యాక్సిన్‌లు అందించి సాయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కిమ్ ఏడో అణు పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కోవిడ్ వ్యాప్తి నుంచి జనాలను మళ్లించే ప్రయత్నంలో కిమ్ తన అణు పరీక్ష ప్రణాళికలను వేగవంతం చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.