ఉత్తర కొరియా లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనాను నియంత్రించడం ఆదేశ వైద్య వ్యవస్థకు సవాల్ గా మారింది. తొలి నుంచి ఆ దేశంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్న కారణంగానే కిమ్ రాజ్యంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఉత్తర కొరియాలో కోవిడ్ కేసులు నమోదయ్యాయయని తెలిపిన మూడు రోజుల్లోనే అక్కడ లక్షలాది మంది జ్వరంతో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 3,24,550 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ అనుమానిత కేసులు 820,620కు చేరుకున్నాయి. అలాగే ఆదివారం అక్కడ జ్వరంతో 15 మంది చనిపోయినట్టు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.
నార్త్ కొరియాలో కోవిడ్ కలకలం రేపుతుంది. ఇప్పటి వరకూ అక్కడ 42 మంది చనిపోయారు. కోవిడ్ అనుమానిత కేసులు 820,620కు చేరుకున్నాయి. అలాగే ఆదివారం ఒక్కరోజే జ్వరంతో 15 మంది చనిపోయినట్టు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. షాపులు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. అయితే కోవిడ్‌ను అడ్డుకోవడం నార్త్ కొరియాకు సాధ్యంకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ అత్యంత దారుణమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, మందుల కొరత కూడా ఉందని అంటున్నారు.
అయితే కోవిడ్‌కు అడ్డుకట్టడ వేయడం నార్త్‌కొరియాకు సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడి ఆరోగ్య వ్యవస్థపై అనేక విమర్శలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, కోవిడ్ వ్యాక్సిన్‌లు, యాంటీవైరల్ ట్రీట్‌మెంట్ డ్రగ్స్ కొరత నిపుణులు అంటున్నారు. కనీసం సామూహిక పరీక్ష సామర్థ్యం కూడా లేదంటున్నారు. అదేకాకుండా నార్త్ కొరియా... చైనా నుంచి కోవిడ్ వ్యాక్సిన్‌లను, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ స్కీమ్‌ను తిరస్కరించింది. దీంతో ఆ దేశంలో కోవిడ్‌తో ప్రజలకు అనేక ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.