పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాతలిక్ చర్చ్ పలువురికి సెయింట్స్‌గా ప్రకటించింది. చరిత్రలో మొట్టమొదటిసారి ఒక భారతీయుడైన పిళ్లైకు ఈ సెయింట్ హుడ్ హోదా దక్కింది. మిగిలిన తొమ్మిది మందిలో నలుగురు మహిళలు ఉన్నారు. భారత్‌కు చెందిన దేవసహాయంకు అరుదైన గౌరవం దక్కింది. 18వ శతాబ్దంలో క్రైస్తవ మతంలోకి మారిన దేవసహాయంకు సెయింట్ హోదాను పోప్ ఫ్రాన్సిస్ వాటికన్‌లొ ప్రకటించారు. సెయింట్ హుడ్ హోదాను పొందిన తొలి భారతీయ సామాన్యుడుగా గుర్తింపు దక్కింది. నీలకంఠ పిళ్లై అలియాస్ దేవసహాయం 1712 ఏప్రిల్ 23న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మారుమూల గ్రామం నత్తాలంలో జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవన్ నంబూద్రి, తల్లి జానకమ్మ.. నాయర్ సామాజకవర్గానికి చెందిన ఆయన హిందూ సంస్థానమైన ట్రావన్‌కోర్ మహారాజు మార్తాండ వర్మ వద్ద పని చేశారు. ఈ సమయంలో ఒక డచ్ దేశానికి చెందిన నావికాదళ కమాండర్ బంధీగా ఉండేవారు. అతడి ద్వారా క్రైస్తవం గురించి తెలుసుకున్న దేవసహాయం పిళ్లై 1745లో క్రైస్తవంలోకి మారారు.
అప్పటి పరిస్థితుల్లో దేవసహాయం పిళ్లై క్రైస్తవంలోకి మారడంతో.. కొంతమంది వ్యతిరేకించారు. ఆయన్ను 1752 జనవరి 14న దేవసహాయాన్ని కాల్చి చంపారు. ఆ తర్వాతి దక్షిణ భారతంలో క్రైస్తవులు దేవసహాయం పిళ్లైను అమరుడిగా చూస్తారు. 2004లో తమిళనాడు బిషప్స్ కౌన్సిల్, కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆండ్ ఇండియా సంస్థలు దేవసహాయం పిళ్లైకు సెయింట్ హోదా ఇవ్వాలని వాటికన్‌ను అభ్యర్థించాయి. ఆ తర్వాత ఆయన ప్రాణత్యాగాన్ని వాటికన్ 2012లో గుర్తించింది. అనంతరం ఆయనను సెయింట్‌హుడ్‌కు ఎంపిక చేసింది. చరిత్రలో మొట్టమొదటిసారి ఒక భారతీయుడైన సామాన్యుడికి సెయింట్‌హుడ్ హోదా దక్కింది.