అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అత్యవసర విధుల నిమిత్తం ప్రతీ పోలీసు స్టేషన్ నుండీ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ కు తీసుకొచ్చిన పోలీసు సిబ్బందితో అదనపు ఎస్పీ నాగేంద్రుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసు సిబ్బంది దైనందిన విధుల్లో ఏమి చేయాలి, ఎలా ఉండాలి మరియు పరిపాలనాపరమైన అంశాలపై డీసీఆర్బీ సి.ఐ విశ్వనాథ చౌదరి అవగాహన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగర్తలు తీసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి , ప్రజలకి భరోసా మరియు పోలీస్ అంటే నమ్మకం పెరిగేలా ప్రవర్తించాలని తెలియచేసారు.