ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు బీసీలు. నాన్ బీసీల్లో విజయ్ సాయిరెడ్డి రిటైర్ అవుతుండగా, మిగతా వారు నలుగురు ఉంటారు. ఇప్పుడు ఎన్నిక కాబోతున్న నలుగురిలో ఇద్దరు బీసీలు. వచ్చే నెల నాటికి రాజ్యసభలో మొత్తం 9 మంది వైయస్ఆర్ సీపీ సభ్యులు ఉంటే, వారిలో 5గురు బీసీలు ఉంటారు. దీన్ని బట్టి బీసీలకు సీఎం వైయస్ జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్ధమవుతుంది అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు, బడుగు, బలహీనవర్గాలకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు ఇస్తున్న ప్రాధాన్యత, వారికి సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా నడిపించాలన్న ఆయన ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నేత. ఆయనకు అపార అనుభవం ఉంది. ఇక్కడ ప్రాంతం అని చూడకుండా, బీసీలను మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగానూ, రాజకీయంగానూ, సామాజికంగానూ ఉన్నత స్థానంలో పెట్టాలన్న ఆశయం మేరకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.