పోలవరానికి సంబంధించి డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగినమాట వాస్తవం. వాల్ నిర్మాణం.. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడి.. వాటిని సరిచేయాల్సిన అనివార్య పరిస్థితి రావడం విచారకరం. తెలుగుదేశం పార్టీ తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జలశక్తి అడ్వయిజర్‌తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్‌సీ, సీడబ్ల్యూసీ నిపుణులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి రీడిజైన్ చేసి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డయాఫ్రంవాల్ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా.. లేదా అనే టెక్నాలజీ లేకపోవడం దురదృష్టకరం. ప్రజలు, మేధావులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న సంఘటన లేదు. ఇదే తొలిసారి. ప్రధాన కారణం.. చంద్రబాబు, దేవినేని ఉమల అజ్ఞానం, తొందరపాటు చర్య, డబ్బు ఆశించి చేసే కార్యక్రమాల వల్లే దెబ్బతిన్నది అనేది వాస్తవం. రెండు, మూడు నెలల్లోనే నిర్ణయం వస్తుంది. డయాఫ్రం వాల్ పూర్తయిన తరువాత ఎర్త్ కం రాక్‌ఫిల్లింగ్ డ్యామ్ పూర్తిచేసి నీరు ఇచ్చే కార్యక్రమం చేపడుతాం.