గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బిలోని ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి బుధవారం 12 మంది చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కావడంతో కూలీలు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని గుజరాత్ రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మీర్జా తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.