గుంటూరుజిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో డిఆర్ సి సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని జడ్పి హల్ లో డిఆర్ సి సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన సమావేశం సజావుగా సాగింది. సమావేశంలో సభ్యులనుద్దేశించి మంత్రి ధర్మాన మాట్లాడుతూ గుంటూరు జిల్లాతో చిరకాలం అనుబందం ఉందని, జిల్లాలో ఉన్న సమస్యలు , రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా వారధిగా నేను పని చేస్తానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.